గూగుల్ సీఈవోకు నిర్మాత బన్నీవాస్ లేఖ

గూగుల్ సీఈవోకు నిర్మాత బన్నీవాస్ లేఖ

సోషల్ మీడియా వల్ల తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానంటూ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్  గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు లేఖ రాశారు.  సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై లేఖలో ప్రస్తావించారు. ఇటీవల తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని.. తన కుమార్తెను చంపేస్తానని చెబుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టాడని బన్నీ వాస్ అన్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో నుంచి తొలగించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలేని భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ వలన మానసికంగా తాను పడ్డ క్షోభను మీలాంటి వారికి చెప్పటం వలన సామజిక మాధ్యమాలలో  భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛ మీద మీ ఆలోచన విధానంలో అభ్యుదయ మార్పు వస్తుందని తన నమ్మకమన్నారు.