Kavya Kalyanram: కీరవాణి కోడలిగా 'బలగం' బ్యూటీ? కాళ భైరవ మనసు గెలిచిన కావ్య!

Kavya Kalyanram: కీరవాణి కోడలిగా 'బలగం' బ్యూటీ? కాళ భైరవ మనసు గెలిచిన కావ్య!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. యంగ్ హీరోస్ బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పేస్తున్నారు. ఇటీవల విజయదేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి ముగిసింది. ఆ తర్వాత అల్లు శిరీష్, నయనికల వివాహం జరిగింది. నాలుగు రోజుల క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశారు. లేటెస్ట్ గా మరో క్రేజీ జంట గురించి ఫిలింనగర్ సర్కిల్ లో ఆసక్తికరమైన చర్చజరుగుతోంది. ' బలగం' సినిమా బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

కీరవాణి ఇంట పెళ్లి బాజాలు?

ప్రముఖ ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు , సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవతో కావ్య కళ్యాణ్ ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారని సమాచారం. ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి ఫీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాళ భైరవ సోదరుడు శ్రీ సింహా నటించిన 'ఉస్తాద్' మూవీలో కావ్య హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆసమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారిందని టాక్ నడుస్తోంది.

ప్రేమకు పెద్దలు గ్రీన్  సిగ్నల్..

ఇరు కుటుంబ పెద్దలు ఇప్పటికే ఈ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నిర్శితార్థం తేదీ కూడా ఫిక్స్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  కీరవాణి చిన్న కుమారుడు సింహా వివాహం ప్రముఖ నటుడు మురళి మోహన్ మనవరాలితో జరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఆయన కుటుంబంలో జరగబోయే ఈ రెండో  వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై కావ్య గానీ, కాల భైరవ గానీ అధికారికంగా స్పందించలేదు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి..

కొత్తగూడెంలో జన్మించినకావ్య కళ్యాణ్ రామ్ .. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాక 'స్నేహమంటే ఇదేరా'తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది.  గంగోత్రి (వల్లంకి పిట్ట), ఠాగూర్, బన్నీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది . 'మసూద'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, 'బలగం'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కావ్య 'వాట్సాప్ నరేష్' అనే చిత్రంలో నటిస్తోంది.  త్వరలోనే కాళ భైరవ, కావ్య కళ్యాణ్ రామ్ తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.