హైదరాబాద్ లో కిలో టమాటా 50 రూపాయలే..

హైదరాబాద్ లో కిలో టమాటా 50 రూపాయలే..

హైదరాబాదీయులకు గుడ్​న్యూస్.. ఇన్నాళ్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన టమాటా ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు పంట దిగుబడి గణనీయంగా పెరడటంతో రూ.200 లకు పైనే పలికిన టమాటా ఇప్పుడు క్రమంగా దిగివస్తోంది. 

హైదరాబాద్లో ప్రస్తుతం వీటి ధర కిలోకు రూ.50 ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదివరకు ధరలు పెరగడంతో చాలా మంది వాటిని కొనడానికి ముందుకు రాకపోవడం కూడా టమాటా ధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా వీటి దిగుబడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అకాల వర్షాలు, పర్యావరణ మార్పులు తదితర కారణాల వల్ల దిగుబడి తగ్గి వాటి ధరలు చుక్కలనంటాయి. ధరలు తగ్గుతుండటంతో అమ్మకాలు పెరుగుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కూడా ధర తగ్గుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.