
ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్స్‌లో రిపేర్లు రావడం చాలా కామన్. వాటిని రిపేర్ చేయడానికి ఎలక్ట్రీషియన్‌ని పిలిపిస్తుంటారు. సమస్య చిన్నదైతే ఎవరికి వాళ్లే చేసుకుంటారు. అలాంటప్పుడు ఈ టెస్టర్ బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎంఎక్స్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ టెస్టర్‌ని 3-పిన్ సాకెట్‌లో ప్లగ్ చేస్తే వెంటనే లోపాన్ని గుర్తిస్తుంది. దాంతో రిపేర్ చేయడం ఈజీ అవుతుంది.
దీనికి ఎరుపు, పసుపు, ఆకు పచ్చ రంగుల్లో మూడు ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. దీన్ని సాకెట్‌లో ప్లగ్ చేసినప్పుడు ఎరుపు, ఆకుపచ్చ లైట్లు వెలిగితే ఎలాంటి లోపం లేనట్టు. ఎరుపు మాత్రమే వెలిగితే ఎర్తింగ్ ఫాల్ట్, పసుపు మాత్రమే వెలిగితే న్యూట్రల్ ఫాల్ట్ ఉన్నట్టు. ఒక్కటి కూడా వెలగకపోతే అసలు కరెంట్‌సప్లై లేనట్టు. కాకపోతే.. ఇది 5A పవర్ సాకెట్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కరెంట్‌షాక్, షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడొచ్చు.