IPL 2026: ఐపీఎల్లో ఈ క్రికెటర్ల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు.. వాళ్లు పేర్లు తెలిస్తే షాకే!

IPL 2026: ఐపీఎల్లో ఈ క్రికెటర్ల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు.. వాళ్లు పేర్లు తెలిస్తే షాకే!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ, మైదానంలో ఆటగాళ్ల మెరుపులే కాదు, సోషల్ మీడియాలో వారిపై చర్చలు కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ లో ఫ్యాన్స్ నెట్టింట ఏ క్రికెటర్ల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు అనే విషయాన్ని ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పేర్కొనింది. మార్చి 28వ తేదీ నుంచి మే 12 వరకు ఉన్న డేటాను పరిగణనలోకి తీసుకుని ఈ లిస్ట్ ని తయారు చేశారు. 

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మాత్రం ఇందులో ఎక్కడా లేదు. వైభవ్ ఈ ఐపీఎల్ లో 36 బంతుల్లోనే ఓ సెంచరీ కొట్టడంతో పాటు రెండుసార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. మరి స్టార్ స్పోర్ట్స్ తెలిపిన టాప్-5 ప్లేయర్లలో ఎవరున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

విరాట్ కోహ్లీ (44%): ఎప్పటిలాగే 'కింగ్' కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌లో అతడి ఫామ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో ఉండటంలో విరాట్ పోషించిన రోల్ వలన దాదాపు సగం చర్చలు ఆయన చుట్టూనే తిరిగాయి.

మహేంద్ర సింగ్ ధోనీ (21%): ఇది నిజంగా షాకింగ్ విషయం. ఈ సీజన్‌లో ధోనీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.. అయినప్పటికీ, అతడి రిటైర్మెంట్ గురించో లేదా స్టేడియంలో ఆయన ఉనికి గురించి అభిమానులు రెండో స్థానంలో నిలిచేలా చర్చించుకున్నారంటే 'తలా' క్రేజ్ ఎలాంటిదో అందరు అర్థం చేసుకోవచ్చు.

రోహిత్ శర్మ (18%): ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, రోహిత్ బ్యాటింగ్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు.

సంజు శాంసన్ (10%): చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా సంజు వరుసగా రెండు సెంచరీలతో పాటు కిరాక్ బ్యాటింగ్ శైలి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

కేఎల్ రాహుల్ (8%): ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇందులో 150+ స్కోర్ తో పాటు రెండు హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాహుల్ వ్యక్తిగత స్కోర్లతో పాటు స్ట్రైక్ రేట్ గురించి చర్చలు జరిగాయి.