కారు పార్క్‌‌ చేసినప్పుడు, ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు ఈ కార్ ఫ్యాన్ పెట్టుకుని రిలాక్స్ అవండి !

కారు పార్క్‌‌ చేసినప్పుడు, ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు ఈ కార్ ఫ్యాన్ పెట్టుకుని రిలాక్స్ అవండి !

కారుని పార్క్‌‌ చేసినప్పుడు, ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఇలాంటి కార్​ ఫ్యాన్​ పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఏఎంజీడీజీ అనే కంపెనీ మార్కెట్‌‌లో అమ్ముతోంది. ఇది బ్రష్‌‌లెస్ మోటారుతో వస్తుంది. ఇందులోని ఫ్యాన్​ 3,710 ఆర్పీఎం స్పీడ్తో తిరుగుతుంది. దీనికి యూఎస్​బీ ద్వారా పవర్ సప్లై చేయాలి. కార్ చార్జర్, పవర్ బ్యాంక్‌‌తో కూడా పనిచేస్తుంది. దీన్ని ఎస్​యూవీ, ఆర్​వీ, ట్రక్, సెడాన్.. ఇలా అన్ని రకాల కార్లలో ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవచ్చు. డ్యాష్‌‌బోర్డ్ లేదా ఆర్మ్‌‌రెస్ట్​కి ఫ్యాన్​ని బిగించడానికి ప్రత్యేకంగా వెనక భాగంలో అంటుకునే ప్యాడ్‌‌లు ఉంటాయి. ఇందులో 3 స్పీడ్‌‌ మోడ్స్​ ఉంటాయి. అడ్జస్టబుల్ హెడ్​తో రావడం వల్ల 360 డిగ్రీల వరకు ఎటువైపైనా తిప్పుకోవచ్చు.