కలికాలం : ఇది పెళ్లాం కాదు.. రాక్షసి.. భర్తను కట్టేసి.. సిగరెట్లతో కాల్చుతూ.. వేరే లెవల్ టార్చర్

కలికాలం : ఇది పెళ్లాం కాదు.. రాక్షసి.. భర్తను కట్టేసి.. సిగరెట్లతో కాల్చుతూ.. వేరే లెవల్ టార్చర్

భార్యకు నరకం చూపించే భర్తను చూశాం. భర్త కొడుతున్నాడని.. తాగి వచ్చి టార్చర్ చేస్తున్నాడనే కంప్లయింట్స్ విన్నాం.. చూశాం.. భర్త సిగరెట్లతో కల్చుతున్నాడంటూ  భార్యలు మొరపెట్టుకున్న ఘటనలు చూశాం.. విన్నాం.. ఇది రివర్స్.. జంబలకిడి పంబ కేసులు.. భర్తను భార్య టార్చర్ పెట్టింది.. అలా ఇలా కాదు.. చేతులు, కాళ్లు కట్టేసి.. నోట్లో పాన్ పరాగ్ వేసి.. సిగరెట్లతో మొగుడిని ఒంటిపై కాల్చటం ఉంది చూడండీ.. ఇదో రకమైన నరకం అన్నమాట.. మొగుడికి.. ఓ పెళ్లాం ఇలాంటి టార్చర్ కూడా పెడుతుందా అన్నట్లు నోరెళ్లబెట్టి.. అవాక్కయిన మన జాతి కోసం.. ఈ స్టోరీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ - బిజ్నోర్ జిల్లాకు చెందిన మనన్ జైదీ,  మెహర్ జహాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మెహెర్‌కి సిగరెట్, మందు అలవాటు ఉండడంతో బలవంత పెట్టి భర్తతో వేరే కాపురం పెట్టించింది.  భర్త మన్నన్ ఆమెను చెడు అలవాట్లు మానుకోమని, తన తల్లిదండ్రులతో కలిసి ఉందామని పలుమార్లు చెప్పి చూశాడు. కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా అలాంటి మాటలు చెప్పిన భర్తను ఆమె చిత్రహింసలు పెట్టేది. భర్త మన్నన్ కు మత్తు మందు ఇచ్చి అతను సృహ కోల్పోయాక చేతులు, కాళ్లు కట్టేసి తన శరీర భాగాలను సిగరెట్‌తో కాల్చేసేది.  

దీనిపై మన్నన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ముందుగా  పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మన్నన్ ఇంట్లో సిక్రెట్ గా  సీసీటీవీ అమర్చాడు. ఒకరోజు మెహెర్ అన్నంలో మత్తుమందు ఇచ్చి అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక అతని రెండు చేతులను కట్టేసి సిగరెట్లతో చాలా చోట్ల కాల్చింది. కత్తితో అతడి ప్రైవేట్ భాగాలను కోసేందుకు ప్రయత్నించగా మెలకువలోకి వచ్చిన మన్నన్ తప్పించుకొని పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా.. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. 

దీంతో మహిళపై హత్యాయత్నం, దాడి, చిత్రహింసలతోపాటు ఐపీసీ సెక్షన్ లోని పలు సెక్షన్ల కింద మెహర్ జహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళపై తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ ధరంపాల్ సింగ్ తెలిపారు.