‘KGF’ ఫేమ్ రాకింగ్ స్టార్ యశ్ (Yash)... రేపు ‘టాక్సిక్’ సినిమాతో థియేటర్లో రచ్చ చేయనున్నాడు. ‘కేజీఎఫ్ 2’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ నుంచి సినిమా వస్తుండటంతో ఆడియన్స్ పిచ్చ క్రేజీలో ఉన్నారు. ముఖ్యంగా వాయిదాల మీద వాయిదాలతో ఆశలు పెంచిన టాక్సిక్, ఎట్టకేలకు రేపు (ఆగస్ట్ 26న) విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ వెయిటింగ్కు ఎండ్ కార్డ్ పడనుంది.అయితే, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే యశ్ భారీ కథతో వస్తున్నారు. అది టీజర్, ట్రైలర్ విజువల్స్ తోనే సినిమా లెవల్ ఏంటనేది ఓ క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుసుకోవాల్సింది కేవలం.. టాక్సిక్ సినిమాను ఎవరు చూడాలి? టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్ టార్గెట్ ఎంత? వంటి వివరాలు.. మరి వాటిపై ఓ లుక్కేద్దాం..
‘టాక్సిక్’ను ఎవరు చూడాలి?
‘టాక్సిక్’ను ఎవరు చూడాలి? అనే విషయానికి వస్తే.. యశ్ మాస్ యాక్షన్‌ను ఇష్టపడే అభిమానులతో పాటు, డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలు, ఇంటెన్స్ యాక్షన్, భారీ విజువల్స్‌ను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఛాయిస్‌గా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించడంతో 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే థియేటర్లలో ప్రవేశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయం 18 ఏళ్ళ కంటే వయసు తక్కవ ఉన్నోళ్లు బాగా గుర్తుంచుకుని సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత తెలియక బుక్ చేసుకున్నాం అని చెప్పిన.. థియేటర్ యాజమాన్యం ఎంట్రీ ఇవ్వదు. కాబట్టి... టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏజ్ చెక్ చేసుకోవడం బెటర్.
టికెట్ ధరలు ఎలా ఉన్నాయి?
టికెట్ రేట్ల విషయానికి వస్తే.. కొన్ని నగరాల్లో ‘టాక్సిక్’ ప్రీమియం షోల టికెట్ ధరలు భారీగా ఉన్నాయి. ముంబైలో కొన్ని షోలకు రూ.2,600 వరకు, బెంగళూరులో ప్రీమియం స్క్రీనింగ్స్‌కు రూ.2,000కు పైగా ధరలు నమోదైనట్లు సమాచారం. కొన్ని మల్టీప్లెక్స్‌లలో రూ.1,500కు మించిన టికెట్ రేట్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, మన హైదరాబాద్ లో ఎలాంటి ప్రీమియర్ షోలు లేవు. రేపు ఉదయం 6 గంటల నుంచి షోలు పడనున్నాయి. ఇకపోతే, విడుదలకు ముందే ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. తాజాగా దేశీయ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.27 కోట్లకు పైగా చేరినట్లు ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి.
భారీ రన్ టైమ్ & సెన్సార్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) ఉండటం విశేషం. అయితే చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించినందున, హింసాత్మక కంటెంట్ కారణంగా ఇది పెద్దల కోసం మాత్రమే. ముఖ్యంగా ఇందులో డార్క్, వైలెంట్ గ్యాంగ్‌స్టర్, రొమాన్స్ వంటి అంశాలు ఉండటం వల్ల ఈ సినిమాను 18 ఏళ్ళు పైబడిన వారే చూడాలి.
బాక్సాఫీస్ టార్గెట్ విషయానికి వస్తే: ‘టాక్సిక్’పై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల నుంచి 125 కోట్లకు పైగా గ్రాస్ సాధించే అవకాశాలపై ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, ప్రీ-రిలీజ్ బజ్‌ను చూస్తే సినిమా లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మూవీ ఫైనల్ రన్లో రూ.1000 కోట్ల నుంచి 1200 కోట్ల మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.
గోవా బ్యాక్డ్రాప్లో జరిగే కథ..
సినిమా కథ స్వాతంత్ర్యం అనంతరం గోవాలో సాగుతుంది. హింస, అసూయ రాజ్యమేలుతున్న ఆ కాలంలో ఓ గ్యాంగ్‌స్టర్ తన విధేయత, నైతిక విలువలు, ప్రేమ కోసం చేసే త్యాగం, వ్యక్తిగత విముక్తి కోసం చేసే పోరాటమే మెయిన్ కథ. చీకటితో నిండిన ప్రపంచంలో ప్రేమ, విముక్తి కోసం చెల్లించాల్సిన మూల్యాన్ని ఈ చిత్రం చూపించనుంది.
భారీ తారాగణం (Star Cast): ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం (Dual Role - Raya, Ticket) చేస్తుండగా, ఆయన సరసన బాలీవుడ్ మరియు సౌత్ స్టార్ హీరోయిన్లు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై క్యూరియాసిటీ విపరీతంగా పెరిగింది.
మొత్తంగా చూస్తే.. యశ్ అభిమానులకు ‘టాక్సిక్’ ఫుల్ మీల్స్ లాంటి యాక్షన్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్, అడ్వాన్స్ బుకింగ్స్ హైప్ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ భారీ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.!
