మా టికెట్ డబ్బులు రిఫండ్ చేయండి .. 'టాక్సిక్' థియేటర్లలో లొల్లి.. యష్ ఫ్యాన్స్ సీరియస్!

మా టికెట్ డబ్బులు రిఫండ్ చేయండి .. 'టాక్సిక్' థియేటర్లలో లొల్లి.. యష్ ఫ్యాన్స్ సీరియస్!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 2’ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన మూవీ 'టాక్సిక్'.  గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా బుధవారం (ఆగస్టు 26, 2026) ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగించు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. కానీ రెండు రోజు నుంచి కాస్త నిరాశపరుస్తోంది.

రెండు రోజుల కలెక్షన్ల ఎంతంటే?

మొదటి రోజు రూ.150 కోట్ల మార్కును అందుకుని అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 సినిమాల జాబితాలో 'టాక్సిక్' చేరింది. అయితే మిశ్రమ స్పందననేపథ్యంలో రెండో రోజు కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపించింది. రెండో రోజు ఇండియాలో రూ.36.40 కోట్ల నెట్ వసూలు చేయగా.. ఓవర్సీస్‌లో మరో రూ.10 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్ల గ్రాస్‌ సాధించింది . ఇండియాలో  రూ.137.50 కోట్లు వసూళ్లు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్..

సుమారు రూ.500 నుంచి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని  నిర్మించారు. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.425 కోట్లకు అమ్ముడయ్యాయి . తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు, కర్ణాటక రూ.100 కోట్లు, ఓవర్సీస్ రూ.70 కోట్లు. సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.850 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో యష్ ద్విపాత్రాభినయంలో అదరగొట్టగా, నయనతార అక్క పాత్రలో, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, జెజె పెర్రీ , అన్బరీవ్ అందించిన యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి యాక్షన్ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. తండ్రీకొడుకుల మధ్య వచ్చే హై-వోల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది. 

మా టికెట్ డబ్బులు రిఫండ్ చేయండి ..

అయితే సినిమాలో అతిహింస, బోల్డ్ రొమాన్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మోతాదు ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి.  కొన్ని చోట్ల ప్రేక్షకులు మా టికెట్ డబ్బులు రిఫండ్ చేయండి అని గొడవ చేయడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై యష్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ‘A’ సర్టిఫైడ్ చిత్రమని మేకర్స్ ముందే స్పష్టంగా చెప్పారని, కావాలనే కొంతమంది పెయిడ్ నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ చిత్రంలో హింస, రొమాన్స్ వంటివి ఉంటాయని మేకర్స్ ముందే చెప్పారు. మరి ఇన్ని తెలిసి కూడా  పనిగట్టుకుని ఈ చిత్రంపై నెగిటివ్ ను ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. థియేటర్ లో మూవీ టికెట్ కొని సినిమా చూసిన తర్వాత, సగం మధ్యలో  వచ్చి చిత్రం బాగలేదు .. మా నగదు రిటర్న్ ఇవ్వండి అంటే తిరిగి ఇస్తారా? అని కొందరు నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు. నెగిటివ్ ప్రచారం కావాలనే చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మరి ఈ మిశ్రమ టాక్ మధ్య కూడా ఈ మాస్ యాక్షన్ రైడ్ మున్ముందు ఎలాంటి కలెక్షన్స్ వసూళ్లు చేస్తుందో వేచి చూడాలి