ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ వాహనాలకు అనుమతి లేదు

ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ వాహనాలకు అనుమతి లేదు

ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఐపీఎల్ లో భాగంగా మే 4వ తేదీ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం చుట్టుపక్కలా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్ స్టేడియంలో గత కొద్దిరోజులుగా ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నగర పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. స్టేడియం ప్రరిసర ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ క్రమంలో SRH, KKR జట్ల మధ్య మ్యాచ్ జరిగే రోజు (గురువారం) సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. లారీలు ట్రక్కులు ఇతర భారీ వాహనాలకు స్టేడియం వైపు వెళ్లే రూట్లలో అనుమతి లేదని వెల్లడించారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.