హైదరాబాద్ ఐఐటీలో విషాదం

 హైదరాబాద్ ఐఐటీలో విషాదం

హైదరాబాద్ ఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ బ్లాక్ లోని 107 గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసుల నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ స్వస్థలం ఏపీలోని నంద్యాల జిల్లా. ప్రస్తుతం అతడి మృతదేహం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో ఉంది.