ఫోన్ చేసే వ్యక్తి పేరు  డిస్‌‌ప్లే కావాల్సిందే! నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి అమలు

ఫోన్ చేసే వ్యక్తి పేరు  డిస్‌‌ప్లే కావాల్సిందే! నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి అమలు

 

న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం రంగంలో స్పూఫింగ్, సైబర్ మోసాలు, స్పామ్ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరికట్టడానికి టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్లలో "కాలర్ నేమ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే" నిబంధనను తప్పనిసరి చేసింది. దీన్ని నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని టెలికాం సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్ల(జియో, ఎయిర్ టెల్, వీఐ మొదలైనవి)ను ట్రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించింది.

దీంతో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రాగానే ట్రూకాలర్ లాంటి థర్డ్-పార్టీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అవసరం లేకుండానే ఫోన్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవతలి వ్యక్తి అసలు పేరు కనిపిస్తుంది. టెలికాం ఆపరేటర్ల సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు, నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కనిపిస్తుంది. సిమ్ కార్డ్ తీసుకునే సమయంలో వినియోగదారులు సమర్పించిన అధికారిక ధృవీకరణ పత్రాల(కేవైసీ) ఆధారంగా ఈ పేర్లు డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే అవుతాయి. ప్రస్తుతానికి 4జీ, 5జీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించే స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగదారులకే ఇది అందుబాటులోకి వస్తుంది. 2జీ, 3జీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కనెక్షన్లలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని ట్రాయ్ పేర్కొంది.