గ్యాడ్జెట్స్: అడవుల్లో ట్రెకింగ్, క్యాంపింగ్ చేసేటోళ్ళకు తప్పనిసరి... ఈ ట్రెక్ సర్వైవల్ కిట్

గ్యాడ్జెట్స్: అడవుల్లో ట్రెకింగ్, క్యాంపింగ్ చేసేటోళ్ళకు తప్పనిసరి... ఈ  ట్రెక్ సర్వైవల్ కిట్

ట్రెక్ ఈజ్ సర్వైవల్ కిట్​ అనేది క్యాంపింగ్, ట్రెక్కింగ్, హైకింగ్, అడవుల్లో ప్రయాణాలు, కొండ ప్రాంతాల్లో విహారం, అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో ఉపయోగపడే చిన్న సైజు గ్యాడ్జెట్.ఇందులో ఏడు రకాల ఫీచర్లు ఉంటాయి. ముఖ్యంగా అత్యవసర సమయంలో గట్టిగా శబ్దం చేసే ఎమర్జెన్సీ విజిల్ ఉంటుంది. దీని శబ్దం మామూలు విజిల్​ కంటే ఎక్కువ దూరం వినిపిస్తుంది. కాబట్టి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లేదా దారి తప్పినప్పుడు ఈ విజిల్ ఉపయోగపడుతుంది. 

దీనిలో ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది. అలాగే మొబైల్ సిగ్నల్ లేకపోయినా ఇందులో ఉన్న కంపాస్​తో ట్రావెలింగ్​ టైంలో దిశలు తెలుసుకోవచ్చు. అయితే ఇది ప్రొఫెషనల్ నావిగేషన్ కంపాస్ కాదు. సాధారణ అవసరాల కోసం మాత్రమే పనికొస్తుంది. అంతేకాదు.. దీనిలో థర్మామీటర్ కూడా ఉంటుంది. దాంతో బయట ఉష్ణోగ్రతను అంచనా వేయొచ్చు. కొన్ని మోడళ్లలో సిగ్నల్ మిర్రర్ లేదా మాగ్నిఫైయింగ్ లెన్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి. 

ఇవి అత్యవసర సమయంలో సూర్యకాంతిని ప్రతిబింబించి దూరంలో ఉన్న వారికి సంకేతాలు ఇవ్వడానికి లేదా చిన్న వస్తువులను స్పష్టంగా చూడడానికి ఉపయోగపడొచ్చు. దీన్ని మెడలో ధరించొచ్చు లేదా బ్యాగ్‌కు తగిలించుకోవచ్చు. బరువు తక్కువగా ఉండటం వల్ల ఎప్పుడూ వెంట తీసుకెళ్లడం ఈజీ. ఈ గ్యాడ్జెట్ ప్లాస్టిక్ బాడీతో తయారవుతుంది.