- రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి
ఆదిలాబాద్, వెలుగు : ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో భోజన వేళలు, మెనూ అమలు, వంటగది శుభ్రత, సామగ్రి నిర్వహణ, ఆఫీసర్ల పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్నందున సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి, సంబంధిత బాధ్యుల వివరాలు, ఫిర్యాదు చేసే విధానం, టోల్‌ఫ్రీ నంబర్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు.
సమావేశంలో ఫుడ్ కమిషన్ సభ్యులు ఒరగంటి ఆనంద్, కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్‌ఎస్.చిత్రు, డీఆర్‌ఓ స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, డీఆర్‌డీఓ రాథోడ్ రవీందర్, డీఎస్‌వో నందిని, డీఎం సుధారాణి, డీఈవో మాధవి, డీఎంహెచ్‌వో సాధన పాల్గొన్నారు.
