ఆసిఫాబాద్, వెలుగు: వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ బాబు బూతులు తిడుతున్నాడని, చిన్న చిన్న కారణాలకే విచక్షణారహితంగా కొడుతున్నాడని ఆరోపిస్తూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ (పీటీజీ) స్టూడెంట్లు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించారు. తమను నిత్యం వేధిస్తున్నారని వాపోయారు. దురుసుగా ప్రవర్తిస్తూ, హింసిస్తున్న వైస్ ప్రిన్సిపాల్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
