కాబోయేవాడికి అలాంటి క్వాలిటీస్.. యానిమల్ బ్యూటీ కామెంట్స్ వైరల్

కాబోయేవాడికి అలాంటి క్వాలిటీస్.. యానిమల్ బ్యూటీ కామెంట్స్ వైరల్

త్రిప్తి డిమ్రి(Tripti Dimri).. యానిమల్(Animal) సినిమాకు ముందు ఈ అమ్మడు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, ఈ సినిమా తరువాత ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. సినిమాలో ఆమె చేసింది చిన్న రోల్ అయినప్పటికి.. తన గ్లామర్ తో నెక్స్ట్ లెవల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలా మంది కుర్రాళ్ళకి లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ఫికస్, ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది త్రిప్తి డిమ్రి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు ఇదే విషయం గురించి ప్రశ్న ఎదురవగా.. తనకు కాబోయే వాడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆలోచన కూడా లేదు. ప్రస్తుతం కెరీర్ పైనే నా పూర్తి ఫోకస్. ఇక నాకు కాబోయే వాడికి.. డబ్బు, స్టేటస్, లేకపోయినా పరవాలేదు.. మనుషులను అర్థం చేసుకునే మనసుంటే చాలు అంటూ చెప్పుకొచ్చింది త్రిప్తి. ప్రస్తుతం త్రిప్తి డిమ్రి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక త్రిప్తి డిమ్రి సినిమాల విషయానికి వస్తే.. యానిమల్ సినిమాకు ముందు పలు వెబ్ సిరీస్ లలో నటించిన ఈబ్యూటీ... ప్రస్తుతం తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సిటీవ్ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించే అవకాశాన్ని త్రిప్తి డిమ్రి దక్కించుకుందని సమాచారం. అయితే.. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే.. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది.