పూర్తిగా ప్రేమలో మునిగితే.. త్రిష ఏ ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేసిందో..!

పూర్తిగా ప్రేమలో మునిగితే.. త్రిష ఏ ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేసిందో..!

ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో ఫుల్‌‌‌‌‌‌‌‌ బిజీగా ఉంది త్రిష. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన గురించి అప్పుడప్పుడు డేటింగ్ రూమర్స్‌‌‌‌‌‌‌‌ వస్తుండడం తెలిసిందే. అయితే ఈసారి తన రిలేషన్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌ను ఆమె కన్ఫర్మ్  చేసిందనే ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ తమిళ స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోతో ఆమె రిలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉందనే విషయం కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ ఏడాది ఆ హీరో బర్త్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా తనతో  కలిసి దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ చెప్పింది. అదే ఫొటోను త్రిష తల్లి షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీని జోడించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్టయింది.

ఈ రూమర్స్‌‌‌‌‌‌‌‌పై పరోక్షంగా స్పందిస్తూ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ఓ పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే.. అది కొందరిని తికమక పెడుతుంది’ అంటూ ఓ లవ్ కొటేషన్‌‌‌‌‌‌‌‌ను ఆమె షేర్ చేసింది. త్రిష ఏ ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ చేసిందో కానీ నెటిజన్స్ మాత్రం తన రిలేషన్‌‌‌‌‌‌‌‌ను ఆమె కన్ఫర్మ్ చేసిందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలోనూ ప్రేమ, పెళ్లి విషయంలో త్రిష గురించి ఇలాంటి రూమర్స్ రాగా, అలాంటిదేమైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పింది.  ఇక ఇటీవల  కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌ ‘థగ్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌’లో కనిపించిన త్రిష.. ప్రస్తుతం చిరంజీవికి జంటగా ‘విశ్వంభర’,  సూర్యకు జంటగా ‘కరుప్పు’ చిత్రాల్లో నటిస్తోంది.