Trisha: ఆ 'మ్యాజికల్ మే' సీక్రెట్ ఏంటి త్రిష? సీఎం విజయ్‌తో డేటింగ్ రూమర్స్‌కు ఆజ్యం పోసిన లేటెస్ట్ ఫోటోస్!

Trisha: ఆ 'మ్యాజికల్ మే' సీక్రెట్ ఏంటి త్రిష? సీఎం విజయ్‌తో డేటింగ్ రూమర్స్‌కు ఆజ్యం పోసిన లేటెస్ట్ ఫోటోస్!

కోలీవుడ్ సీనియర్ బ్యూటీ త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హీరో విజయ్‌తో త్రిష రిలేషన్‌షిప్‌లో ఉందంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె పెట్టిన ఒక క్రేజీ క్యాప్షన్ అభిమానులకు, నెటిజన్లకు మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది.

సోమవారం (జూన్ 1) త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మే నెలకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత మధుర జ్ఞాపకాలను 'ఫోటో డంప్' రూపంలో పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కతో దిగిన క్యూట్ పిక్స్, పూల బొకేలతో అలంకరించిన లివింగ్ రూమ్, సాంప్రదాయ సల్వార్ సూట్‌లో మెరిసిపోతున్న ఫోటోలు ఉన్నాయి. అయితే, ఈ పోస్ట్‌కు ఆమె ఇచ్చిన క్యాప్షనే అసలు కథకు కారణమైంది. "మ్యాజికల్ మే (Magical May) నుండి మరికొన్ని జ్ఞాపకాలు.. దీనిని చూసి నేను చాలా కాలం పాటు నవ్వుకుంటూనే ఉంటాను" అంటూ త్రిష రాసుకొచ్చింది.

ఈ 'మ్యాజికల్ మే' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. గడిచిన మే నెలలో త్రిష జీవితంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి.. మే 4న ఆమె పుట్టినరోజు కాగా, మరొకటి.. అదే మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సంచలన విజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రి కావడం. విజయ్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం త్రిష హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఆమె విజయ్ విజయాన్ని ఉద్దేశించే 'మ్యాజికల్ మే' అని పేర్కొందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.  

గతంలో కూడా మే నెల ప్రారంభంలో 'మే (నా) సీజన్ అధికారికంగా ప్రారంభమైంది' అంటూ త్రిష హింట్ ఇచ్చింది. ఇటీవల నటుడు అజిత్ కుమార్ మాతృమూర్తి మరణించినప్పుడు పరామర్శించడానికి విజయ్, త్రిష ఒకేసారి వెళ్లడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. తాము కేవలం మంచి స్నేహితులమే అని ఇరుపక్షాలూ చెబుతున్నప్పటికీ.. ఈ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)