V6 News

త్రివానకు ఐజీబీసీ రేటింగ్

త్రివానకు ఐజీబీసీ రేటింగ్

హైదరాబాద్​, వెలుగు: త్రివాన బొటిక్ విల్లా కమ్యూనిటీ రెసిడెన్షియల్​ ఐజీబీసీ ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్ దక్కించుకుంది. తుక్కుగూడ ప్రాంతంలోని అల్మాస్ గూడలో జీహెచ్ఆర్ యూఎస్ఎం డెవలపర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. పర్యావరణ హితమైన డిజైన్, స్థిరమైన అభివృద్ధికి  ఈ రేటింగ్ లభించింది. ఈ విల్లా కమ్యూనిటీలో నీటి వినియోగాన్ని 37 శాతం వరకు తగ్గించేలా ఏర్పాట్లు చేశారు. వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించామని జీహెచ్ఆర్ తెలిపింది.