త్రివిక్రమ్ - బన్నీ కాంబో టాక్..తెలంగాణ మాండలికంలో డైలాగ్స్!

త్రివిక్రమ్ - బన్నీ కాంబో టాక్..తెలంగాణ మాండలికంలో డైలాగ్స్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తన డైలాగ్స్తో సినిమాలను హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తాడు. హీరోలకే కాకుండా డైరెక్టర్స్కి కూడా ఫ్యాన్స్ ఉండటంలో త్రివిక్రమ్ ఒకరు. ఎప్పుడు తన మూవీస్లో స్టోరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వని త్రివిక్రమ్..ఈ సారి అదిరిపోయే స్టోరీని రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది. 

రీసెంట్గా మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో సక్సెస్తో పాటు విమర్శలు అందుకున్నారు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో త్రివిక్రమ్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని త్రివిక్రమ్ ఒక ప్రయోగాత్మకమైనా హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్లో తెరకెక్కిస్తారని చాలా కాలంగా టాక్ వినిపిస్తూ వచ్చింది. అయితే లేటెస్ట్గా మరో టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాలో అల్లు అర్జున్ తెలంగాణ మాండలికంలో..తనదైన యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే, అల్లు అర్జున్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబితే ఏ లెవల్లో ఉంటాయో తెలిసిందే. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్లో తెలంగాణ భాషతో డైలాగ్లు చెప్పి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు.

అయితే, ఈ మూవీలో త్రివిక్రమ్ స్థాయిని మించి డైలాగ్స్ ఉంటాయని టాక్. ఏదేమైనా త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ సినిమాతో తన స్థాయిని..పాన్ ఇండియా వైడ్గా చాటుకునే సరైన అవకాశం ఉండటంతో..కథపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని విషయాలు మేకర్స్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ (Geetha arts), హారికా హాసిని క్రియేషన్స్(Haarika hassine creations) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టును త్రివిక్రమ్ 2024 చివరలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది.