
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 9 న సినిమా విడుదల కానుంది. సోమవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ‘ఈ సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. హీరోకు ప్రేమ కావాలి, అతని చుట్టూ ఉన్న పరిస్థితులకు సర్దుకుపోవడం కావాలి.
ఈ రెండింటి మధ్య అతను పడే వేదన హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. మణికందన్ క్యారెక్టర్ చూస్తుంటే మన ఎదురుగా ఒక వ్యక్తిని చూస్తున్న ఫీల్ కలిగింది. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు, లవ్‌లో లేని వాళ్లు అందరూ చూడొచ్చు’ అని చెప్పాడు. భాషలకు అతీతంగా ఇండియాలో యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది అని చెప్పారు ఎస్‌కేఎన్. ఇదొక హానెస్ట్ ట్రూ ఫిల్మ్ అని, తమ విజన్‌ను నమ్మి తెలుగులో రిలీజ్ చేస్తున్న మారుతి, ఎస్‌కేఎన్‌లకు థ్యాంక్స్ చెప్పారు హీరో హీరోయిన్. లవర్స్ మధ్య ఉంటున్న మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించానని దర్శకుడు ప్రభురామ్ చెప్పాడు. డైలాగ్స్, లిరిక్ రైటర్ రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.