బైడెన్‌ ప్రమాణ స్వీకారం..వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ

బైడెన్‌ ప్రమాణ స్వీకారం..వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ

అమెరికా అధ్యక్షుడిగా  ఈ నెల 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో ట్రంప్ అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ విధించారు. వాషింగ్టన్‌లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ మద్దతుదారుల క్యాపిటల్‌ హిల్‌ బిల్డింగ్‌ పై దాడి చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.

బైడెన్‌ ప్రమాణ స్వీకారం సమయంలో ఘర్షణలు జరగనున్నాయన్న ఎఫ్‌బిఐ హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్‌ వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 24 వరకు ఎమర్జెన్సీ ఉంటుందని ప్రకటించారు.