భారత్‌కు భారీ ఊరట.. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై.. 100శాతం టారిఫ్ ఎత్తివేసిన ట్రంప్

భారత్‌కు భారీ ఊరట.. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై.. 100శాతం టారిఫ్ ఎత్తివేసిన ట్రంప్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు ఊరట లభించింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై విధించాల్సిన ఆంక్షలు, 100శాతం సుంకాలు ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షల అమలుకు ఇచ్చిన నెలరోజుల గడువు రేపటితో ముగియనున్న క్రమంలో రష్యానుంచి  చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు ఉపశమనం లభించినట్లయింది. 

ఉక్రెయిన్ కు కొత్త అధ్యక్షుడు అవసరం అని, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని బహిరంగంగా విమర్శించడం ద్వారా రష్యాకుసానుకూల ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా  మారింది. 

ఇటీవలే అమెరికా ఆమోదించిన చట్టం ప్రకారం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించే అవకాశం ఉండగా..ఈ నిబంధనలు అమలులోకి రావడానికి ఒక రోజు ముందే దేశ ప్రయోజనాలను ఉటంకిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

సెప్టెంబర్ లో అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందిన  లిండ్సే ఓ గ్రహామ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 ప్రకారం రష్యా నుంచి చమురు కొనే అగ్రదేశాలపై భారీ సుంకాలు విధించింది. కానీ, తాజా మినహాయింపుతో భారత్‌కు వంద శాతం పన్నుల ముప్పు పూర్తిగా తప్పింది.