మే 25న ఎంసెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

మే 25న ఎంసెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణ ఎంసెట్- 2023 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.  మే 25వ తేదీన ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్రక‌టించారు. మే 25వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేస్తార‌ని తెలిపారు. హైదరాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారని వెల్లడించారు.

ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫలితాలను ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా తెలుసుకోవ‌చ్చని తెలిపారు. ఇక మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను కూడా ఆ రోజే(మే 25) వెల్లడించ‌నున్నారు. ఎంసెట్ ఫ‌లితాల కోసం eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్లను లాగిన్ అవొచ్చని చెప్పారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోవాలి

అభ్యర్థులు  //https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి


హోం పేజీలో టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ 2022 (TS ECET Results 2022) సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయండి 

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేయండి

 తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోండి