పీజీ ఈసెట్‌ 2023 ఫలితాలు విడుదల

పీజీ ఈసెట్‌ 2023 ఫలితాలు విడుదల

తెలంగాణలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పీజీ ఈసెట్‌)-2023 ఫలితాలు వెలువడ్డాయి.  2023 జూన్ 08 గురువారం రోజున మధ్యాహ్నం 3.30గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల ఫలితాలను విడుదల చేశారు.  విద్యార్ధులు ఫలితాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు.  19 విభాగాల్లో 13 వేల 981 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 

2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌ / ఫార్మసీ/ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం JNTU  పీజీఈసెట్‌ 2023 పరీక్షను నిర్వహించింది.  ఈ ఏడాది మే 29 నుంచి జూన్‌ 1వరకు ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశ పరీక్ష జరిగింది. పరీక్షకు 16,563 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా దాదాపు 14,882 మంది విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యారు.