TSRJC సెట్ ప్రవేశ పరీక్ష రద్దు

TSRJC సెట్ ప్రవేశ పరీక్ష రద్దు

హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రవేశ పరీక్ష (టీఎస్ ఆర్జేసీ సెట్)ను రద్దు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కరోనా పరిస్థితులు కుదుటపడకపోవడంతో.. పరీక్షల నిర్వహణకు అనుకూలంగా లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు జరుపుతామని ఆయన వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 7వ తేదీలోపు మార్కులను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.tswreis.in  లో తెలుసుకోవాలని ఆయన సూచించారు.