ఆర్టీసీ అప్రెంటీస్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్..

ఆర్టీసీ అప్రెంటీస్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్..

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో ఆర్టీసీ  పలు పోస్టులను భర్తీ చేయనుంది. అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ )నాన్ ఇంజినీరింగ్) అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటుంది. మొత్తం 50 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 

21- 30 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ మూడేళ్లలో ఫస్ట్ ఇయర్ (నెలకు) రూ. 15 వేలు, సెకండ్ ఇయర్ 16 వేలు, థర్డ్ ఇయర్ రూ.17 వేలు స్టెఫండ్ ఇవ్వనున్నారు.  ఆన్ లైన్ అప్లికేషన్లు ఫిబ్రవరి 16 లాస్ట్ డేట్. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http/tsrtc.telangana.gov.in ని సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.