TSRTCలో 3వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

TSRTCలో 3వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 3వేల పోస్టుల భర్తీ చేయనుంది. ప్రత్యేకంగా ఇటీవల ఏర్పాటు చేసిన రూట్లు, కొనుగోలు చేస్తున్నా కొత్త బస్సులలో సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ రిక్రూట్ మెంట్ చేపడుతోంది. 

ముఖ్యంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, ప్రత్యేకించి మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత బస్సులను పెంచడం, ఆర్టీసీ సేవలను బలోపేతం చేసేందుకు రిక్రూట్ మెంట్ ను చేపట్టనున్నట్ల సీనియర్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 

ఇటీవల టీఎస్ ఆర్టీసి 813 బస్సు, కండక్టర్లు, డ్రైవర్ల పోస్టుల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రణాళికలు వెల్లడించింది.ఇటీవల మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులనుంచి అర్హలైన 50 మందికి అపాయింట్ మెంట్  లెటర్లు కూడా ఇచ్చారు. 
కారుణ్య నియామకాలతోపాటు అదనపు నియామకాలు చేపడతామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రస్తుతం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీఎస్ ఆర్టీసీకి హామీ ఇచ్చింది.