జ్యోతిష్యం: తులారాశిలో బుధుడు తిరోగమనం.. ఏరాశి వారికి ఎలా ఉంటుంది.. 12 రాశుల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.!

జ్యోతిష్యం: తులారాశిలో బుధుడు తిరోగమనం..  ఏరాశి వారికి ఎలా ఉంటుంది.. 12 రాశుల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు  అక్టోబర్ 24 న  తన దిశను మార్చుకుంటాడని పండితులు చెబుతున్నారు.  తులారాశిలో సవ్య దిశగా ఉన్న బుధుడు  అక్టోబర్ 24  మధ్యాహ్నం 12:42 గంటలకు తిరోగమనంలో సంచరించడం ప్రారంభిస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇదే దిశలో నవంబర్ 13 వరకు కొనసాగుతాడు.   దీని ప్రభావంతో నాలుగు రాశుల (కన్య, తుల, మకర, వృశ్చిక )  వారికి ఊహించని లాభాలు కలుగుతాయి.  12 రాశులవారి జీవితాలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది.  ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!

మేషరాశి: తులారాశిలో బుధుడు తిరోగమనం వలన ఈ రాశి వారు ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.   అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  వృత్తి ... వ్యాపారాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంతో చికాకు... అసహనం కలుగుతాయి. ఉద్యోగ విధుల్లో  కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. .  వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు .. సహనం పాటించండి  .. తరువాత కాలంలో మంచే జరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కీలకనిర్ణయాలు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో కొత్త ప్రాజెక్ట్​లు చేపట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.

పరిహారం:  ఆదిత్యహృదయం పారాయణం చేయండి అంతా మంచే జరుగుతుంది. 

వృషభరాశి:  బుధుడు .. తులా రాశిలో తిరగోమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.  కొన్ని తెలియని అంశాలు మిమ్మలను ఆందోళనకు గురిచేస్తాయి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాహనం డ్రైవింగ్​ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు.  ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది.  చేతివృత్తులవారికి ప్రోత్సహకాలు అందుతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు జాబ్​ లభిస్తుంది. 

పరిహారం:  మంగళవారం హనుమంతుడికి వడమాల సమర్పించండి.

మిధునరాశి:  ఈ రాశికి బుధుడు అధిపతి.  బుధుడు కమ్యూనికేషన్‌కు కారకుడు.  తులారాశిలో  తిరోగమన సమయంలో ఈ రాశి వారికి గడ్డుకాలమని పండితులు చెబుతున్నారు.  ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీ మాటల వల్ల ఎలాంటి అపార్థాలు రాకుండా చూసుకోండి.కీలక పత్రాలపై సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి .ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తారు.  పనిభారం పెరుగుతుంది. ఆశించినంతగా ఆర్థికంగా పురోగతి ఉండదు.  వ్యాపారస్తులు పోటీ మార్కెట్​ లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  
పరిహారం: మాసశివరాత్రి రోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయండి 

కర్కాటక రాశి:  బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశి వారు ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి.  కొత్త ప్రాజెక్ట్​లు చేపడితే ఊహించని లాభాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.  వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు జరుగుతాయి.  చిన్న చిన్న విషయాల్లో  వాగ్వాదాలు రావచ్చు..  కాబట్టి సంయమనం పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.   అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి . ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచే జరుగుతుంది.

పరిహారం: సోమవారం ప్రదోష కాలంలో పరమేశ్వరునికి మహన్యస పూర్వక రుద్రాభిషేకం

సింహరాశి:  బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.  మీరు చేసే పనుల విషయంలో నిరాశ పడవద్దు.ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కొన్ని పనులు మిమ్మలను ఆందోళనకు గురిచేస్తాయి.  వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండండి.  ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది.  మొత్తం మీద ఈ రాశి వారికి బుధుడు తిరోగమనంలో ఉన్నసమయంలో  పనిభారం పెరుగుతుంది.  ఖర్చులను నియంత్రించుకోవాలి.  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని  జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

పరిహారం: గురువారం పేదలకు అన్నదానం చేయండి.. 

కన్యారాశి:    బుధుడు తులారాశిలో తిరోగమనం వలన ఈ రాశి వారికి  అన్ని విధాలా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు ... వ్యాపారస్తులకు మంచి సమయం. కేరీర్​ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు.  ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్​ పొందే అవకాశం ఉంటుంది.  బిజినెస్​ చేసే వారు పెట్టే కొత్త పెట్టుబడులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు.  నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్​ వచ్చే అవకాశం ఉంది.  అయితే ప్రేమ వ్యవహారంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

పరిహారం:  గురువారం దక్షిణామూర్తి స్త్రోత్రం పఠించాలి.. గోమాతకు తోటకూర ఆహారంగా ఇవ్వాలి. 

తులారాశి :  ఇదే రాశిలో  బుధుడు తిరోగమనంలో సంచారం వలన ఈ రాశికి చాలా మంచి జరుగుతుంది.  గతంలో ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది.  మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆఫీసులో మీరే కీలకం కావడంతో  ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి.  ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  తొందరపడి ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.  పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

పరిహారం : మంగళవారం ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయాలి. 


వృశ్చిక రాశి: తులారాశిలో బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశి జాతకులకు మెరుగైన ఫలితాలుంటాయి.  ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.  వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు ఇంక్రిమెంట్​ పొందుతారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ఈ సమయంలో చేపట్టిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారని పండితులు చెబుతున్నారు. 

పరిహారం:  శనివారం  శని భగవానుడికి తైలాభిషేకం

ధనుస్సు రాశి: బుధుడు తిరోగమన కదలిక వల్ల  ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి.  ప్రతి విషయంలోను.. మీకు సంబంధం లేకుండా మాట పడాల్సి వస్తుంది.  వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.    జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడే అవకాశం ఉంది.. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుదల కనిపిస్తుంది. 

పరిహారం: ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించి... ఆకుపూజ చేయండి

మకరరాశి:  బుధుడు తులారాశిలో తిరోగమనం  ఈ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది..ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  పూర్వీకుల ఆస్తి కలసిరావడంతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.  . నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు.వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. అయితే ఏదో తెలియని ఆందోళన కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది.

పరిహారం:  బుధవారం.. వినాయకుడికి గరిక సమర్పించండి.  

 కుంభరాశి :   బుధుడు మీనరాశిలో తిరోగమనం చెందడం వలన  ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతి ఫలం లభిస్తుంది.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఆవేశాన్ని.. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.  ఎట్టి పరిస్థితిలో భావోద్వేగానికి లోను కావద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఆఫీసులో మీరే కీలకం అవుతారు.  ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది. 

పరిహారం:    మంగళవారం 11 సార్లు హనుమాన్​ చాలీసా చదవండి. 

మీనరాశి: బుధుడు తిరోగమన కదలిక వల్ల  ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి.  ప్రతి విషయంలోను.. మీకు సంబంధం లేకుండా మాట పడాల్సి వస్తుంది.  వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.    జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడే అవకాశం ఉంది.. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుదల కనిపిస్తుంది. 

పరిహారం:శనివారం ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించి... ఆకుపూజ చేయండి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.