Vastu tips: ఇంట్లో సామాన్లు మారిస్తే వ్యాపారంలో నష్టం వస్తుందా..!

Vastu tips:  ఇంట్లో సామాన్లు మారిస్తే వ్యాపారంలో నష్టం వస్తుందా..!

కొంతమంది ఇంట్లో సామాను అదే పనిగా మారుస్తుంటారు.. ఇటున్న టీవీ అటు పక్కకు.. ఫ్రిజ్​ మరో పక్కకు.. సోఫా.. ఇంకా అనేక వస్తువులను పిల్లి తిరిగినట్టు తిప్పుతుంటారు... అలా తరచూ సామాను మారిస్తే ఆర్థికంగా నష్టం కలుగుతుందా.. వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రనివాస్​ ఏమంటున్నారో చూద్దాం. . .

 ప్రశ్న: నా భార్యనెలకొకసారి హల్లో సామాన్లు మారుస్తోంది. ఇటీవల టీవీని వాకిలి పక్కనున్న కిటికీ దగ్గరకు, సోఫా తూర్పునకు, ఫ్రిజ్ కిచెన్ గోడ తగిలేలా మార్చింది. వ్యాపారంలో రెండు లక్షల లాస్ వచ్చింది. దీనికి, సామాన్లు మార్చడానికి సంబంధం ఉందా?

జవాబు : ఇంట్లో సామాన్లు మార్చడానికి, వ్యాపారంలో నష్టం రావడానికి సంబంధం లేదు. కానీ ఇంట్లో సామాన్లు వాస్తు ప్రకారం ఉండాలి. వాస్తు ప్రకారం ఉత్తర ఈశాన్యంలో బరువు ఉండకూడదు. టీవీ అటువైపు ఉంటే మార్చుకోండి. సోఫా దక్షిణంవైపు ఉండాలి. ఫ్రీజ్ ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. టీవీ తూర్పు లేదా ఉత్తరం దిక్కుల్లో మార్చుకోవచ్చని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.