తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన విజయ్ టీవీకే పార్టీ ఇపుడు దేశ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. పార్టీ పెట్టిన రెండేళ్లకే 108 సీట్లతో రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్న వేళ.. ఇపుడు సోషల్ మీడియాలో విజయ్ కారు నంబర్ ప్లేట్ వైరల్ అవుతోంది. ఏంటి..విజయ్.. రాష్ట్ర భవిష్యత్తును ముందే ఊహించారా? అనే చర్చ నడుస్తోంది.
అసలు సంగతి ఏంటంటే.? దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమాలో TN 07 CM 2026 అనే కార్ నంబర్ ప్లేట్. అయితే ఇది కేవలం అనుకోకుండా జరిగింది కాదని.. విజయ్ ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో CM అంటే చీఫ్ మినిస్టర్ అని ..2026 అంటే ఎన్నికల సంవత్సరం అని అభిమానులు విశ్లేషిస్తున్నారు. అప్పట్లోనే విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) భవిష్యత్తు గురించి సినిమాలో హింట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ క్రేజీ ఎడిట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌తో హోరెత్తిస్తున్నారు
ఈ వైరల్ ఎడిట్స్‌లో మరో ఆసక్తికరమైంది 07 నంబర్. ఇది లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్.. అలాగే తమిళనాడులో థళా x దళపతి కాంబినేషన్ కోసం ఈ నంబర్‌ను వాడారని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాలో త్రిష ఉండటం... గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కేవలం టైటిల్ మాత్రమే కాదు భవిష్యత్తుకు సంకేతం అంటూ చర్చించుకుంటున్నారు.
తమిళనాడులో మే 4న వెల్లడైన ఫలితాల్లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 108 సీట్లు సాధించిన విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 73 సీట్లతో డీఎంకే ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక ఏఐఏడీఎంకే 53 సీట్లు సాధించింది.
