వింబుల్డన్‌‌కు అల్కరాజ్‌‌ దూరం.. .. ఫిట్నెస్ లేదు.. తప్పుకున్నాడు

వింబుల్డన్‌‌కు అల్కరాజ్‌‌ దూరం.. .. ఫిట్నెస్ లేదు.. తప్పుకున్నాడు

లండన్‌‌: స్పెయిన్‌‌ స్టార్‌‌ ప్లేయర్‌‌ కార్లోస్‌‌ అల్కరాజ్‌‌.. వింబుల్డన్‌‌ నుంచి తప్పుకున్నాడు. గత కొంతకాలంగా వేధిస్తున్న కుడి మణికట్టు గాయం పూర్తిగా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బార్సిలోనా ఓపెన్‌‌లో అల్కరాజ్‌‌కు ఈ గాయమైంది. దీనివల్లే ఈ వారాంతంలో ప్రారంభం కానున్న ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లోనూ అతను ఆడటం లేదు. 

గత రెండేళ్లుగా ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌ నెగ్గిన అల్కరాజ్‌‌.. రెండుసార్లు వింబుల్డన్‌‌ చాంపియన్‌‌గా నిలిచాడు. ‘నా ఆరోగ్యం మెరుగవుతోంది. ప్రస్తుతం బాగానే ఉన్నా. కానీ దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలో పోటీపడటానికి సరిపోయే ఫిట్‌‌నెస్‌‌ సాధించలేదు’ అని అల్కరాజ్‌‌ పేర్కొన్నాడు.