సిటీలో మరో రెండ్రోజులు వానలు

సిటీలో మరో రెండ్రోజులు వానలు

సిటీలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే చాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.  మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు  సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.  పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. ఏఎస్​రావు నగర్, చర్లపల్లి, మల్లాపూర్, మోండా మార్కెట్, నాచారం, హయత్ నగర్, వెస్ట్ మారేడ్ పల్లి, యూసుఫ్ గూడ తదితర ప్రాంతాల్లో వాన పడగా.. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

- వెలుగు , హైదరాబాద్