బోనీకపూర్‌‌ హోమ్‌ స్టాఫ్‌లో మరో ఇద్దరికి కరోనా

బోనీకపూర్‌‌ హోమ్‌ స్టాఫ్‌లో మరో ఇద్దరికి కరోనా
  • మొత్తం ముగ్గురికి పాజిటివ్‌
  • జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడి

ముంబై: బాలీవుడ్‌ ఫిలిమ్‌ మేకర్‌‌ బోనీకపూర్‌‌ ఇంట్లో మరో ఇద్దరు హోమ్‌ స్టాఫ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. హోమ్‌ స్టాఫ్‌లోని 23 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలిన 48 గంటల్లోనే మరో ఇద్దరికి వైరస్‌ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ వచ్చింది. బోనీకపూర్‌‌ తన ఇద్దరు కూతుళ్లు జానీకపూర్‌‌, ఖుషీకపూర్‌‌తో కలిసి ముంబైలోని లోఖండ్‌వాలాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్టాఫ్‌లో ఒకరికి కరోనా రావడంతో ఇంట్లో పనిచేసే వారితో పాటు బోనీ కపూర్‌‌, ఆయన కూతుళ్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. తామంతా క్షేమంగా ఉన్నామని, కరోనా లేదని బోనీకపూర్‌‌ ఒక ప్రకటన రిలీజ్‌ చేశారు. 14 రోజులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నామని ప్రకటించారు.