Health: టైప్1 షుగర్ ఉంటే.. పిల్లలు పుట్టరా? డాక్టర్లు చెబుతున్న సమాధానం ఇదే

Health: టైప్1 షుగర్ ఉంటే.. పిల్లలు పుట్టరా? డాక్టర్లు చెబుతున్న సమాధానం ఇదే

షుగర్(డయాబెటిస్).. రోజురోజుకు పెరిగిపోతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు.శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల రక్తంలో  చక్కెర స్థాయిల్లో మార్పులతో వచ్చే జీవక్రియ వ్యాధి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లు షుగర్ లని రకాలు. టైప్ 2తో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ  టైప్1 నిర్ధారణ అయితే  రోగుల్లో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ షుగర్ టెస్టులు ప్రతి రోజు ఇవి చేయాల్సిందే. వీటికి మించి పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులను  భయపెడుతున్న మరో ఆందోళన.. తమ బిడ్డకు లైఫ్ పార్టినర్ దొరుకుతారా..?పిల్లలు పుడతారా, ఈ వ్యాధి వారి పిల్లలకు వస్తుందా అని .ఈ భయాల గురించి వాటికి స్పష్టమైన, భరోసా ఇచ్చే సమాధానాలు అవసరం.  ఇదే విషయంపై డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. 

ప్రపంచవ్యాప్తంగా 58 కోట్లమంది, మన దేశంలో 10 కోట్ల మంది షుగర్ వ్యాధిలో బాధపడుతున్నారు. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక షుగర్ రోగులు ఉన్న రెండవ దేశం భారత్. దీనికి తోడు మరో 13.6 కోట్ల మందికి పైగా ప్రీ-డయాబెటిస్ దశ లో ఉన్నారు. ఇలాంటి సందర్భంగా రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో అనేక సందేహాలు, భయాలు కలుగుతుంటాయి. టైప్ 1 ఉంటే పెళ్లి అవుతుందా, పిల్లలు పుడతారా, పిల్లలు పుడితే డయాబెటిస్ సంక్రమణంగా వస్తుందా? అనేక ప్రశ్నలతో ఆందోళన చెందుతుంటారు. 

మనదేశంలో ఫేమస్ డయాబెటాలజిస్ట్, శాస్త్రవేత్త ,  డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్  వ్యవస్థాపక చైర్మన్, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) ఛైర్మన్ అయిన డాక్టర్ వి. మోహన్ టైప్ 1 డయాబెటిస్ రోగుల ఆందోళనపై ఇన్ స్టా గ్రామ్ లో ప్రస్తావించారు. షుగర్ ట్రీట్ మెంట్ లో దశాబ్దాల అనుభవం ఉన్న ఈ డాక్టర్.. డయాబెటిస్ పేషెంట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. టైప్ 1 డయాబెటిస్ అనేది రోగుల వివాహానికి, తల్లిదండ్రులు కావడానికి, సంతృప్తికరమైన జీవితానికి ఎప్పుడు అడ్డు కాదని  చెబుతున్నారు. 

టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారు పెళ్లి చేసుకోవచ్చు. ఈ వ్యాధి ఉన్న పెళ్లి చేసుకోవడం,  పిల్లల్ని కనడం, చివరికి తాతయ్యలు, నానమ్మలు కావడం కూడా చూశామన్నారు డాక్టర్ మోహన్. డయాబెటిస్ పట్ల ఉన్న సమాజంలో అపోహల వల్లే తరచుగా ఆందోళన తలెత్తుతుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధికి రోజువారీ సంరక్షణ అవసరం కావచ్చు, మిగతాదంతా సాధరణమే అన్నారు. 

టైప్ 1 పేరెంట్స్ నుంచి పిల్లలకు సంక్రమిస్తుందా?..

తల్లిదండ్రులు, దంపతుల్లో  ఉన్న అతిపెద్ద ఆందోళనలలో ఇది ఒకటి. టైప్ 1 పేరెంట్స్ లో పిల్లలకు అస్సలు సంక్రమించదు అని చెప్పలేం కానీ చాలా తక్కువే అంటున్నారు. వందలో 5నుంచి 8 మందికి సంక్రమించే అవకాశం ఉందంటున్నారు డాక్టర్.  అయితే భాగస్వాములిద్దరికి టైప్ 1 డయాబెటిస్ ఉంటే పిల్లలకు సంక్రమించే ప్రమాదం సుమారు 20 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. 

టైప్ 1 డయాబెటిస్ ఉందని పెళ్లి, పిల్లలు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. సరైన చికిత్స, క్రమం తప్పకుండా షుగర్ టెస్టులు, డాక్టర్ల సలహాలు పాటించడం ద్వారా సాధారణ జీవితం గడపవచ్చని చెబుతున్నారు. పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ అది తప్పనిసరి కాదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల డయాబెటిస్‌పై ఉన్న అపోహలను వీడి, అవసరమైన వైద్య సలహాతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు.