15 రోజులు సూర్యుడినే చూడలే : సంజయ్​ రౌత్

15 రోజులు సూర్యుడినే చూడలే : సంజయ్​ రౌత్

ముంబై : జైలులో ఉండటం వల్ల తాను పది కేజీల బరువు తగ్గానని ఉద్ధవ్​ థాక్రే క్యాంపు శివసేన నాయకుడు సంజయ్​రౌత్​ చెప్పారు. మనీలాండరింగ్​ కేసులో స్పెషల్​ కోర్టు బెయిల్​ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడారు. తనను చీకటి గదిలో ఉంచేశారని, 15 రోజుల పాటు అసలు సూర్యుడిని కూడా చూడలేదని చెప్పారు. జైల్లో సరైన లైటింగ్​ లేకపోవడం వల్ల తన కంటిచూపు దెబ్బతిందన్నారు. ఇప్పుడు చూడటానికి, చదవడానికి కూడా ఇబ్బంది పడుతున్నానని, వినడం.. మాట్లాడటంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటన్నింటినీ తట్టుకునేందుకు తాను సిద్ధమన్నారు.

తనను తాను యుద్ధ ఖైదీగా అభివర్ణించుకున్న ఆయన.. ప్రభుత్వంతో తాము యుద్ధం చేస్తున్నట్టుగా సర్కారు భావిస్తోందని ఆరోపించారు. తాను వారికి(బీజేపీ వాళ్లకు) లొంగిపోయినా లేదా నోరు మూసుకుని ఉన్నా అరెస్ట్​ అయ్యే వాడినే కాదని చెప్పారు.