రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం: ఉద్ధవ్‌ థాకరే

రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాం: ఉద్ధవ్‌ థాకరే

మహారాష్ట్రలో రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే. 2015 ఏప్రిల్‌ 1నుంచి 2019 మార్చి 31 వరకూ రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయిల వరకూ ఉన్న స్వల్ప కాలిక పంట రుణాలను మాఫీ చేయాలని ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు తక్షణ ఉపశమనం కలిగించేలా 2 లక్షల రూపాయిల వరకూ ఉన్న రుణాలను మాఫీ చేశామని…అయితే వారి మొత్తం పంట రుణాలను మాపీ చేయాలని నిర్ణయించామని చెప్పారు ఉద్ధవ్‌ థాకరే.