ఊహలో ప్రేమ నిజం కాదు

ఊహలో ప్రేమ  నిజం కాదు

నందు, అవికా గోర్ జంటగా ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అగ్లీ స్టోరీ’. సోమవారం ఈ మూవీ గ్లింప్స్‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో నందు, అవికా వింటేజ్‌‌ లుక్‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. ‘నా ఊహల్లో ఉన్న ప్రేమ నా రియల్ లైఫ్‌‌లో లేదు. నాకే కాదు ఇక్కడ చాలామందికి ఉండదు’ అని వీడియో చివరిలో నందు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

బెక్కెం వేణుగోపాల్, సి.హెచ్.సుభాషిణి, కొండా లక్ష్మణ్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే టీజర్, ట్రైలర్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.