UIDAI కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఇప్పుడున్న mAadhaar స్థానంలో ఈ యాప్ ను తీసుకొచ్చింది. కొద్దిరోజుల్లో పాత యాప్ mAadhaar ను పూర్తిగా క్లోజ్ చేయనున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు ముందస్తుగా Aadhar యాప్ ను డౌన్ చేసుకొని డేటా బదిలీ చేసుకోవాలని సూచించింది. కొత్త యాప్ ద్వారా వినియోగదారుల ప్రైవసీ మెరుగుపర్చే ఫీచర్లను అందిస్తుంది. ఈ కొత్త యాప్ లో క్యూఆర్ కోడ్ తో ఆధార్ కార్డు ను షేర్ చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమ పూర్తి ఆధార్ నంబర్‌ను బహిర్గతం చేయకుండానే తమ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు.
లక్షలాది మంది భారతీయులు తమ ఫోన్లలో ఆధార్ గుర్తింపును నిర్వహించేందుకు ఉపయోగించే mAadhar యాప్ ను నిలిపివేస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ పటిష్టమైన భద్రత, ప్రైవసీ ఫీచర్లతో కొత్త యాప్ ను ప్రారంభించింది. mAadhaar ఆఫ్ లైన్ లోకి వెళితే పాత యాప్ ను పూర్తిగా పనిచేయదు.. కాబట్టి వినియోగదారులు తప్పనిసరిగా వెంటనే కొత్త యాప్ Aadhaar కు మారాలని ఉడాయ్ కోరింది.
mAadhaar యాప్‌ను ఎందుకు నిలిపివేస్తున్నారు.. ?
పాత యాప్ కాలం చెల్లినదిగా భావిస్తుంది ఉడాయ్. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ (DPDP) చట్టానికి మరింత అనుగుణంగా ఉండేలా, కస్టమర్లకు మరింత ప్రైవసీ అందించేలా అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంచుకునేలా కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్‌ను సహాయ మంత్రి జితిన్ ప్రసాద ,ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ప్రారంభించారు.
కొత్త ఆధార్ యాప్ లో కొత్తగా ఏమున్నాయి?
ఈ అప్‌గ్రేడ్ వినియోగదారుల ప్రైవసీని నేరుగా రక్షించే ఫీచర్లను అందిస్తుంది. ఇందులోని కొత్త ఫీచర్ క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్. దీని ద్వారా వినియోగదారులు తమ పూర్తి ఆధార్ నంబర్‌ను బహిర్గతం చేయకుండానే తమ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. సెలెక్టివ్ షేర్ అనే ఆప్షన్ ద్వారా వినియోగదారులు తమ పేరు, ఫోటో, వయస్సు, లింగం, చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఆధార్ స్టేటస్ వంటి ఏ వివరాలను షేర్ చేయాలా వద్దా అనేది ఆప్షన్ గా ఉంటుంది.
18ఏళ్లు నిండి ఉండాలనే నిబంధనలున్న ప్రదేశాల్లో లేదా యాప్ లలో వినియోగదారులు వయసును నిర్ధారించుకోవాలంటే.. ఈ యాప్ డేట్ ఆఫ్ బర్త్ , ఆధార్ నంబర్ వెల్లడించకుండా వయస్సు ధృవీకరించుకోవచ్చు. ఉదాహరణకు హోటల్ లలో మీ ఆధార్ ఫొటో కాపీని అందించాల్సిన అవసరం ఉండదు.
ఈ యాప్ లో ఫేస్ అథెంటికేషన్, ఆఫ్ లైన్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ లాక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మీకు తెలియకుండా ఎవరూ యాక్సెస్ చేయకుండా నిరోధించవచ్చు. ఫింగర్ ప్రింట్, ఐరిష్, ఫేస్ డేటాను లాక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఆధార్‌తో అటాచ్ చేసిన మొబైల్ నంబర్ ,చిరునామాను నేరుగా యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఒకే అకౌంట్ కింద ఐదుగురు కుటుంబ సభ్యుల వరకు జోడించుకోవచ్చు.
