కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్

న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ విభాగాల్లో 827 మెడికల్ ఆఫీసర్/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-–2024 అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: మొత్తం 827 పోస్టుల్లో మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్): 163, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే): 450, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌‌‌‌): 14, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2(ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌): 200 ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: ఎంబీబీఎస్‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 1 ఆగస్టు 2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.  నెలకు రూ.56,100- నుంచి 1,77,500 ఉంటుంది. అప్లికేషన్​ ఫీజు రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​​: రాత పరీక్ష (500 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ (100 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష జులై 14న నిర్వహిస్తారు.  పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.