కేటీఆర్ పైకి ఉల్లిగడ్డలు, టమాటలు

కేటీఆర్ పైకి ఉల్లిగడ్డలు, టమాటలు

భైంసా రోడ్ షోలో కేటీఆర్​కు నిరసన సెగ తగిలింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. జైశ్రీరాం అంటే ఉద్యోగం రాదు’’అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై హనుమాన్ దీక్షాపరులు నిరసన తెలిపారు. కేటీఆర్ గో బ్యాక్.. కేటీఆర్ ఖబడ్దార్.. అంటూ నినాదాలు చేశారు. ఆయనపై టమాటలు, ఉల్లిగడ్డలు విసిరారు. కేటీఆర్ ఫొటో ఉన్న ప్లకార్డులను చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు.

 పోలీసులను నెట్టేసి కేటీఆర్ వెహికల్ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో గంటసేపు ఉద్రిక్తత ఏర్పడింది. నిరసనపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘ఇలా అల్లరి చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు. మా వాళ్లు రెచ్చిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటయ్. మిమ్మల్ని రాముడు దాడి చేయమని చెప్పాడా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చచ్చిపోయారా? అంటూ కామెంట్స్ చేశారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన హనుమాన్ స్వాములు కేటీఆర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.