అంబానీ ఇంట్లో షారూఖ్ గణేష్ పూజ

అంబానీ ఇంట్లో షారూఖ్ గణేష్ పూజ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జవాన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ ను రీచ్ అవ్వడానికి బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా షారుఖ్ ఫ్యామిలీ..ఇండియాలోనే ఫేమస్ బిజినెస్ మెన్ అయిన ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ఫ్యామిలీ తో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరిద్దరీ ఫ్యామీలీ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ( Nita Ambani) వినాయక చవితి సందర్బంగా (సెప్టెంబర్ 19న) పలువురు బాలీవుడ్ సెలబ్రేటిస్ ని తమ యాంటిలియా లోని విలాసవంతమైన నివాసంలో ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 

ఈ వీడియో లో షారుఖ్ ఖాన్ పూజలో పాల్గోని గణేశుని ఆశీస్సులు అందుకున్నారు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో లో షారుఖ్..నీతా అంబానీని ఆప్యాయంగా హాగ్ చేసుకోవడంతో..అంబానీ కుటుంబంతో, షారుఖ్ కు ఉన్న స్నేహ బంధం ఎంత స్ట్రాంగ్ అనేది అర్ధం అవుతుంది. 

అలాగే ఈ వేడుకల్లో షారుఖ్ వేసుకున్న డ్రెస్ చాలా ట్రేడషనల్ గా కనిపిస్తోంది. పఠానీ కుర్తా మరియు సల్వార్‌లో అదిరిపోయాడు. షారుఖ్ భార్య గౌరి మెరిసే లేత గోధుమరంగు సూట్‌ని ధరించి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, దీపికా పడుకునే, సీనియర్ నటి రేఖ, తదితరులు పాల్గొనడంతో..బిజినెస్ మెన్ ఇంట్లో..బాలీవుడ్ తారల అందం అన్నట్టు కనిపిస్తోంది. 

షారుఖ్ జవాన్ మూవీ 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని రూ.883.68 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.