కొణిదెల వారింటికి మెగా ప్రిన్సెస్‌.. మీడియా ముందుకు చరణ్-ఉపాసన

కొణిదెల వారింటికి మెగా ప్రిన్సెస్‌.. మీడియా ముందుకు చరణ్-ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan)- ఉపాసన కొణిదెల(Upasana Konidela) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20 మంగళవారం రోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. దీంతో మెగా కుటుంబం సంబరాలు చేసుకున్నారు. అయితే ఇన్నిరోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు ఉపాసన. ఇక తాజా సమాచారం ప్రకారం మెగా ప్రిన్సెస్‌(Mega Princes)తో ఆమె జూన్‌ 23 శుక్రవారం డిశ్చార్జ్ అవ్వనున్నారని తెలుస్తోంది.

ఉపాసనతో పాటు పాప కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపడంతో..  శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ కానున్నారు.  దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయట. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి  ఇంటికి వెళ్లే ముందు రామ్ చరణ్- ఉపాసన దంపతులు అపోలో హాస్పిటల్ వద్ద​ మీడియాతో మాట్లాడనున్నారు. మెగా ప్రిన్సెస్‌ రాకతో తమకు, తమ కుటుంబానికి  శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలపనున్నారు.