మెగా బర్త్డేకి మెగా ట్రీట్.. చిరంజీవి కొత్త మూవీ అప్డేట్

మెగా బర్త్డేకి మెగా ట్రీట్.. చిరంజీవి కొత్త మూవీ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంక‌ర్(Bhola shankar) మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో చిరు తరువాత సినిమాపై ఆందరిలోను ఆసక్తినెలకొంది. తాజాగా చిరంజీవి చేయబోతున్న నెక్స్ట్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా ఉదయం 10:45 నిమిషాలకు ఈ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. యూవీ క్రియేషన్స్‌(UV Creations) నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకు  బింబిసార(Bimbisara) ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ(Mallidi Vasishta) దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సంధర్బంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా చాల ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ న్యూస్ తో మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందా అని ఇప్పటినుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ క్రేజీ ప్రెజెక్టు కి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.