యుఐ ప్రపంచంలోకి స్వాగతం.. మరోకొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఉప్పి

యుఐ ప్రపంచంలోకి స్వాగతం.. మరోకొత్త కాన్సెప్ట్తో వస్తున్న ఉప్పి

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ప్రేక్షకులను సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసే కన్నడ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉపేంద్ర(Upendra).. ఈసారి యుఐ(UI) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోమవారం విడుదల చేశారు. అల్లు అరవింద్‌‌‌‌‌‌‌‌, శివరాజ్ కుమార్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ముఖ్య​అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వర్చువల్‌‌‌‌‌‌‌‌ రియాలిటీ, ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ క్రియేషన్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించినట్టు చెప్పిన మేకర్స్.. సినిమాలో దాదాపు తొంభై శాతం విఎఫ్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటాయన్నారు.

టీజర్ విషయానికొస్తే.. ‘ఇది ఏఐ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కాదు.. యూఐ వరల్డ్‌‌‌‌‌‌‌‌’ అంటూ ప్రారంభంలో ఓ వాయిస్ వినిపిస్తుంది. అడవిలో ఆడమ్‌‌‌‌‌‌‌‌ అండ్ ఈవ్‌‌‌‌‌‌‌‌లతో మొదలైన ఈ ప్రపంచంలో మారుతున్న నాగరికత, రకరకాలైన మనుషులను చూపించారు. చివర్లో ఎద్దుపై నల్లని ముసుగుతో వచ్చిన ఉపేంద్ర సీరియస్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో  కనిపించారు. కథ ఏమిటనేది రివీల్ చేయనప్పటికీ యాక్షన్‌‌‌‌‌‌‌‌ విజువల్స్‌‌‌‌‌‌‌‌, స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. మరోసారి ప్రేక్షకుల ఊహకందని కథేదో ఉపేంద్ర చెప్పబోతున్నాడని అర్థమవుతోంది. రీష్మా నానయ్య, మురళీ శర్మ, పి రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  అజనీష్‌‌‌‌‌‌‌‌ బి లోక్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ సంగీతం అందిస్తున్నాడు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్, వీనస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.