సినిమా కోసం ‘ఉప్పెన’ బ్యూటీ భారీ సాహసం

 సినిమా కోసం ‘ఉప్పెన’ బ్యూటీ  భారీ సాహసం

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి అర్జెంటుగా ఓ హిట్ అవసరం. రెండో సినిమా బంగార్రాజు, శ్యామ్​సింగరాయతో పరవాలేదనిపించినా.. ఆ తర్వాత ఆమెను డిజాస్టర్లు పలకరించాయి. నితిన్​ ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్​ ‘ది వారియర్’ సినిమాలు గుర్తింపునివ్వలేదు. ప్రస్తుతం కార్తీతో కృతి ఓ సినిమా చేస్తోంది. ఇదిలావుంటే తన నెక్ట్స్​ సినిమా కోసం ఈ బ్యూటీ భారీ సాహసమే చేయనుందట.

ఓ బడా హీరో, నిర్మాతల కాంబోలో వస్తోన్న సినిమాలో కృతి బికినీలో కనిపిస్తోందని టాక్.​ అందుకోసం ఏకంగా రూ. 4 కోట్ల రెమ్యునరేషన్​ ఆఫర్​ చేశారట. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం కృతి నాగచైతన్యతో ‘కస్టడీ’ చేస్తోంది. తమిళ్​తో పాటు మలయాళంలోనూ బిజీగా ఉంది.