కొత్త జోనర్‎తో ముందుకొస్తోన్న కీర్తి.. మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

కొత్త జోనర్‎తో ముందుకొస్తోన్న కీర్తి.. మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

ఆగస్టులో ‘రివాల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీటా’ అనే లేడీ ఓరియెంట్‌‌‌‌‌‌‌‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న కీర్తి సురేష్.. అంతకంటే ముందు ఓ సెటైరికల్ మూవీతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ఐ.వి.శశి తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. సోమవారం ఈ మూవీ స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు. జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌‌‌‌‌‌‌‌ వీడియోలో ఇది స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తోంది. నైంటీస్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సెటైరికల్ కామెడీ మూవీగా దీన్ని తెరకెక్కించారు. 

ఓ మారుమూల గ్రామంలో అంత్యక్రియల సదుపాయాల కోసం జరిగే పోరాటం చుట్టూ అల్లుకున్న కథ ఇదని అర్థమవుతోంది. ఆహ్లాదకర హాస్యంతో ఆలోచింపజేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల వచ్చిన ‘శుభం’ సినిమాకు కథను అందించిన వసంత్ మారింగంటి ఈ చిత్రానికి కూడా కథను అందించాడు. రాధిక లావు నిర్మించిన ఈ చిత్రంలో సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.