యూపీఎస్సీ సీజీఎస్ఈ నోటిఫికేషన్

యూపీఎస్సీ సీజీఎస్ఈ నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​సీ) కాంబినైడ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ (సీజీఎస్ఈ)– 2027 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గనుల మంత్రిత్వశాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుల్లో జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, కెమిస్ట్ తదితర గ్రూప్–-ఏ, గ్రూప్-–బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 127.
విభాగాల వారీగా ఖాళీలు
కేటగిరీ–I: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (గనుల మంత్రిత్వశాఖ) 111.
జియోలాజిస్ట్, గ్రూప్– ఏ 29, కెమిస్ట్, గ్రూప్–ఏ 7, అసిస్టెంట్ జియోలాజిస్ట్, గ్రూప్–బి 34, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, గ్రూప్–బి 35, అసిస్టెంట్ కెమిస్ట్, గ్రూప్–బి 6.
కేటగిరీ-II: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ 
(జలశక్తి మంత్రిత్వశాఖ) 16.
సైంటిస్ట్ బీ (హైడ్రోజియాలజీ) - గ్రూప్–-ఏ 5, సైంటిస్ట్ బీ (కెమికల్) - గ్రూప్-–ఏ1, సైంటిస్ట్ బీ (జియోఫిజిక్స్) గ్రూప్–-ఏ1, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ - గ్రూప్–-బీ 7, అసిస్టెంట్ కెమిస్ట్ - గ్రూప్-–బీ1, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ - గ్రూప్–-బీ 1.

ఎలిజిబిలిటీ
జియాలజిస్ట్ / అసిస్టెంట్ జియాలజిస్ట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియోలాజికల్ సైన్స్, జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియో-ఎక్స్​ప్లోరేషన్, మినరల్ ఎక్స్​ప్లోరేషన్, ఇంజినీరింగ్ జియాలజీ, మెరైన్ జియాలజీ, ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఓషనోగ్రఫీ అండ్ కోస్టల్ ఏరియాస్ స్టడీస్, పెట్రోలియం జియోసైన్సెస్ లేదా జియోకెమిస్ట్రీ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
జియోఫిజిసిస్ట్ / అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్ / సైంటిస్ట్ బి (జియోఫిజిక్స్): ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, జియోఫిజిక్స్, ఎక్స్​ప్లోరేషన్ జియోఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్ లేదా మెరైన్ జియోఫిజిక్స్ విభాగాల్లో ఎంఎస్సీ డిగ్రీ కలిగి ఉండాలి. 
కెమిస్ట్ / అసిస్టెంట్ కెమిస్ట్ / సైంటిస్ట్ బి (కెమికల్): కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్‌ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, 
హైడ్రో- కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ విభాగాల్లో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.

సైంటిస్ట్ బి (హైడ్రోజియాలజీ) / అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్: జియాలజీ, అప్లైడ్ జియాలజీ, మెరైన్ జియాలజీ లేదా హైడ్రోజియాలజీ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
వయసు: 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 2.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22. 
కంబైన్డ్ జియో- సైంటిస్ట్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్: 2027, జనవరి 10. 
కంబైన్డ్ జియో- సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్: 2027, జూన్ 19, 20. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ upsconline.nic.inను సందర్శించండి. 

సెలెక్షన్ ప్రాసెస్
యూపీఎస్సీ కాంబినైడ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ (సీజీఎస్ఈ)–2027 ఎంపిక విధానం మూడు దశల్లో కొనసాగనుంది. 

* స్టేజ్-I (ప్రిలిమినరీ పరీక్ష): ఇది ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష. ప్రతి స్ట్రీమ్‌కు రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షకు మొత్తం 400 మార్కులు కేటాయించారు. స్ట్రీమ్–-I (జియాలజీ/ హైడ్రోజియాలజీ) ప్రిలిమ్స్ పరీక్షలో 2 గంటల వ్యవధితో 100 మార్కులకు పేపర్–-I (జనరల్ స్టడీస్), అలాగే మరో 2 గంటల వ్యవధితో 300 మార్కులకు పేపర్–-II (జియాలజీ/ హైడ్రోజియాలజీ) ఉంటాయి. మిగతా జియోఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రీమ్‌లకు కూడా సంబంధిత సబ్జెక్టులతో ఇదే తరహా పేపర్లు ఉంటాయి. 

* స్టేజ్-II (మెయిన్ పరీక్ష): ఇది కన్వెన్షనల్/ డిస్క్రిప్టివ్ (వ్యాసరూప) విధానంలో ఉండే పరీక్ష. ప్రతి స్ట్రీమ్‌కు మూడు పేపర్లు ఉంటాయి. దీనికి మొత్తం 600 మార్కులు ఉంటాయి. 

* స్టేజ్–-III (పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ): పర్సనల్ ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు.