
ఆన్లైన్లో లోన్లు తీసుకుంటున్నారా?..లోన్లకోసం ఆన్లైన్లో కనిపించే యాప్‌లను నమ్ముతున్నారా..? ఏ యాప్‌లో పడితే ఆ యాప్‌లో లోన్ కోసం అప్లయ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త..మీ డేటా, ప్రైవసీకి, మీ బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో లోన్ యాప్‌ల వాడకం గురించి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది...
ఈ లోన్ యాప్ లు అన్నీ చట్టబద్దమైనవి అనిపించొచ్చు.. కానీ వినియోగదారుల ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు వీటిని తయారు చేశారని చెబుతోంది. ప్రైవసీ, డేటా, నగదు కాజేసేందుకు ఇదో రకం మోసం అని అంటోంది. ఈ మోసపూరిత ఆర్థిక అప్లికేషన్లలో చాలా వరకు శత్రు విదేశీ సంస్థలకు చెందినవని అధికారులు గుర్తించారు.
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారిక హ్యాండిల్ సైబర్ దోస్ట్ ద్వారా కస్టమర్లకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మోసపూరిత ఆర్థిక యాప్‌ల జాబితాను Xలో ఇటీవలి పోస్ట్‌లో సైబర్ దోస్ట్ పంచుకుంది. సైబర్ దోస్ట్ ప్రకారం.. ఈ అప్లికేషన్లు వినియోగదారులను మోసం చేయడమే కాకుండా వారి డేటా, ఆర్థిక, ప్రైవసీని కూడా ప్రమాదంలో పడేస్తాయి.
సైబర్ దోస్త్ గుర్తించిన నకిలీ లోన్ యాప్‌ల లిస్టు ఇదే..
- Invoicer Experts
- Loan Raina - Instant Loan Online
- Gupta Credit - Safe and Handy
- GranetSwift
- LoanQ | Financial Calculator
- CreditEdge
- Ultimate Lend
- SmartRich Pro
- CreditLens
- Cash Loan - EMI Calculator
వినియోగదారులకు సైబర్ దోస్త్ సూచనలు..
- యాప్ నకిలీదా, ఒరిజనలా , దాని ప్రాముఖ్యతను నిర్ధారించుకోవాలి.
- RBI గుర్తించిన లోన్ యాప్ లను మాత్రమే వినియోగించాలి.
- ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
మొబైల్ కస్టమర్లకు ఆందోళనకు గురిచేసే హెచ్చరికను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. కొద్ది రోజుల్లోనే మరో హెచ్చరిక చేసింది. ఫోన్ కాల్స్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే వారికి వార్నింగ్ ఇచ్చింది. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ మీ సంభాషణలను వినడానికి వీలు కల్పిస్తుంది..ఇది మీ డేటాను దొంగిలించేందుకు ఛాన్స్ ఉంది. గూగుల్ క్రోమ్‌లోని సెట్టింగ్ లద్వారా ఏ యాప్ లు మైక్రోఫోన్ వినయోగానికి ఏ యాప్‌లకు అనుమతి చెక్ చేసుకోవాలి.. వెంటనే డిసేబుల్ చేయాలి.