‘ఉరి’ నటుడు కన్నుమూత

‘ఉరి’ నటుడు కన్నుమూత

సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన మూవీ ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ‘. ఈ సినిమాలో హోం మినిస్టర్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు నవ్‌తేజ్ హుందాల్  కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో నవ్‌తేజ్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల  సినీ, టీవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ (సీఐఎన్‌టీఏఏ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నవ్‌తేజ్ కుటుంబసభ్యులకు అసోసియేషన్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్విటర్ లో పోస్ట్ పెట్టింది.

నవ్‌తేజ్‌కు భార్య అవంతిక హుందాల్, ఇద్దరు కూతుళ్లున్నారు. 1993లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ఖల్‌నాయక్, తేరే మేరే సప్నే (1996), ది విస్పరర్స్ (2009)చిత్రాల్లో నవ్‌తేజ్ నటించారు